కొచ్చిలో దారుణం.. కారులో మోడల్ పై అత్యాచారం

  • పబ్ లో మద్యం సేవించిన మోడల్
  • ఇంటి వద్ద దిగబెడతామని చెప్పి కారులో ఎక్కించుకున్న గ్రూప్
  • రాత్రంతా కారులో తిప్పుతూ అఘాయిత్యం
కొచ్చిలో దారుణం.. కారులో మోడల్ పై అత్యాచారం
కొచ్చిలో కామాంధులు బరితెగించారు. 19 ఏళ్ల మోడల్ పై నడుస్తున్న కారులో అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి ఈ దారుణం జరిగింది. ఈ కేసులో ఒక మహిళ సహా మొత్తం నలుగురిని ఎర్నాకుళం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొచ్చిన్ షిప్ యార్డ్ సమీపంలోని ఓ పబ్ కు వెళ్లిన బాధిత మోడల్, అక్కడ మద్యం సేవించింది. దీన్ని అవకాశంగా భావించిన కొందరు, ఆమెను కక్కనాడ్ లోని తన నివాసం వద్ద దిగబెడతామని చెప్పి కారులోకి ఎక్కించుకున్నారు. రాత్రంతా పట్టణం చుట్టూ తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను రూమ్ వద్ద వదిలి పెట్టి వెళ్లిపోయారు. 

బాధిత మోడల్ ను చికిత్స కోసం కలమసెర్రి మెడికల్ హాస్పిటల్ కు తరలించారు. ఆమెకు గాయాలైనట్టు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇది వెలుగు చూసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి వీణా చార్జ్ ప్రకటించారు. నిందితులపై కఠిన చర్య తీసుకుంటామని ప్రకటించారు. 



More Telugu News