కల్వకుంట్ల కవితకు వెన్నుపోటు పొడిచింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కవితను ఓడించారన్న జీవన్ రెడ్డి 
  • తమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందనే భావనతో ఓడించారని వ్యాఖ్య 
  • నిజామాబాద్ లో రైతుల చేత నామినేషన్లు వేయించింది బీజేపీనే అన్న కాంగ్రెస్ నేత 
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కవితకు ఆమె సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కవిత గెలిస్తే తమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందనే భావనతో ఆమెను ఓడించారని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పడిన ఓట్లు కవితకు ఎందుకు పడలేదని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల చేత నామినేషన్ వేయించింది బీజేపీనే అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు వేయిస్తే వారు బీజేపీలో ఎందుకు చేరుతారని ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ఈ వ్యాఖ్యలే చేశారు. ప్రెస్ మీట్ లో కవిత పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలే ఆమెను ఓడించారని అన్నారు.


More Telugu News