నా గురించి అందరితో అలా చెప్పింది శ్రీదేవినే: చంద్రమోహన్
- సుదీర్ఘమైన కెరియర్ ను చూసిన చంద్రమోహన్
- గట్టిపోటీని తట్టుకుని నిలబడిన కథానాయకుడు
- తాజా ఇంటర్వ్యూలో శ్రీదేవిని గురించిన ప్రస్తావన
- తనతో నటించాలనేది హీరోయిన్స్ కలగా ఉండేదన్న చంద్రమోహన్
తెలుగు తెరపై హ్యాండ్సమ్ హీరోలుగా కృష్ణ .. శోభన్ బాబు ... రామకృష్ణ వంటి హీరోలు కొనసాగుతున్న సమయంలో, నటుడిగా చంద్రమోహన్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. సుదీర్ఘమైన కెరియర్ ను చూశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "సినిమాల్లోకి రావాలని నేను అనుకోలేదు. సినిమాల్లోకి వచ్చిన తరువాత కష్టాలు పడలేదు. మొదటి సినిమా 'రంగుల రాట్నం'తోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది.. వరుస సినిమాలతో బిజీ అయ్యాను" అన్నారు.
'యశోద కృష్ణ' సినిమాలో బాలకృష్ణుడిగా శ్రీదేవి చేస్తే, నేను నారద మహర్షి పాత్రను చేశాను. ఆ సినిమా షూటింగు సమయంలో శ్రీదేవి నా ఒళ్లో పడుకుని నిద్రపోయేది. అలాంటి శ్రీదేవి నాకు హీరోయిన్ గా 'పదహారేళ్ల వయసు' సినిమా చేసింది. ఆ సినిమా 150 రోజులు ఆడింది. ఆ సినిమా తరువాత శ్రీదేవి కెరియర్ ఎక్కడికో వెళ్లిపోయింది" అని చెప్పారు.
"చంద్రమోహన్ పక్కన హీరోయిన్ గా చేస్తే ఇక తిరుగుండదు అనే విషయాన్ని శ్రీదేవి .. ఆమె అమ్మగారే అందరితోను చెప్పారు. దాంతో జయసుధ .. జయప్రద .. రాధిక .. విజయశాంతి .. సుహాసిని వీళ్లంతా నాతో చేయడానికి ఉత్సాహాన్ని చూపించారు. నా డేట్స్ ఖాళీగా లేకపోతే, నా కోసం భానుప్రియ చాలా రోజుల పాటు వెయిట్ చేసింది. ఇలా 30 .. 40 మంది హీరోయిన్లు నాతో చేసిన తరువాత స్టార్స్ అయ్యారు" అని చెప్పుకొచ్చారు.