తెలంగాణలో గోల్ మాల్ గోవిందం గాళ్లు ఎక్కువయ్యారు: సీఎం కేసీఆర్
- జగిత్యాల జిల్లాలో కేసీఆర్ పర్యటన
- కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం
- ఇలాంటివారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
- బీజేపీ పాలన ప్రమాదకరమని వ్యాఖ్య
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ జగిత్యాల జిల్లాలో కలెక్టరేట్ భవనం ప్రారంభించి, మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణలో గోల్ మాల్ గోవిందం గాళ్లు, అడ్డగోలుగా మాట్లాడేవాళ్లు ఎక్కువయ్యారని విమర్శించారు. ఇలాంటి వాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆగం కావొద్దని సూచించారు.
దేశ రాజకీయాలను తెలంగాణ ప్రజలు ప్రభావితం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ పాలన చాలా ప్రమాదకరమని అన్నారు. ప్రధాని మోదీ తన పాలనలో ఒక్క మంచిపనైనా చేశారా? అని ప్రశ్నించారు. ఎన్ పీయేల పేరిట కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని, ప్రభుత్వ సంస్థలన్నింటినీ కేంద్రం అమ్మేస్తోందని విమర్శించారు.
మోదీ పాలనలో మాటల గారడీ, గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడ చూసినా చైనా ఉత్పత్తులే కనిపిస్తున్నాయని, ఇదేనా మోదీ చెబుతున్న మేక్ ఇన్ ఇండియా? అంటూ నిలదీశారు.