ఈ నెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం
- జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్
- టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్పు
- ఢిల్లీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాల నేతలు
- ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి వేముల, ఎంపీ సంతోష్
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచనతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీనే బీఆర్ఎస్ గా మార్చారు.
ఈ నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 14న ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో సీఎం కేసీఆర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఇక్కడ రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు.
కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ లు నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. ఓ వాస్తు నిపుణుడితో కలిసి యాగశాల స్థలం పరిశీలించారు.
మరికొందరు పార్టీ నేతలు నేడు, రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా హాజరుకానున్నట్టు తెలుస్తోంది.