పెంపుడు శునకం - ఇల్లాలు.. దాగుడు మూతల దండాకోర్!
- తలుపు చాటున నక్కిన ఇంటి యజమాని
- వెతుక్కుంటూ వచ్చిన కుక్కపిల్ల
- ఎన్నో పర్యాయాలు అటూ ఇటూ పరుగెత్తిన తర్వాత గెలిచిన శునకం
దాడుడు మూతలు ఆడడం అంటే చిన్నారులు ఎంతో ఇష్టపడతారు. ఈ ఆట ఆడడం నాకు కూడా వచ్చని నిరూపించింది ఓ పెంపుడు శునకం. అచ్చం పిల్లలతో మాదిరే శునకాన్ని ఆటపట్టిద్దామనుకుంది ఇల్లాలు. వేగంగా గదిలోకి వచ్చి తలుపు చాటునకు వెళ్లి కనిపించకుండా నించుంది. మరో గదిలో నుంచి తన యజమాని కోసం ఆరాటంగా ఆ చిన్న కుక్క పిల్ల పరుగెత్తుకుంటూ బెడ్ రూమ్ లోకి వచ్చింది. అయినా గుర్తు పట్టలేకపోయింది. అలా ఒకటికి నాలుగు సార్లు ఆ గదిలో నుంచి ఈ గదిలోకి పరుగులు పెట్టింది.
చివరికి తలుపు చాటున ఉన్న ఇల్లాలిని ఆ పెంపుడు కుక్క పిల్ల గమనించి వేగంగా దగ్గరకు వెళ్లిపోయింది. మొత్తానికి ఆటలో తన యజమానిని ఓడించింది. పెంపుడు కుక్కలు కుటుంబ సభ్యులతో కలసిపోవడం, వారు చేసిన పనులను అనుకరించడం సాధారణమే. కాకపోతే ఈ ఇల్లాలు, శునకం ఆడిన దాగుడు మూతల ఆట వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో ఆకర్షణగా మారింది. అప్పటి వరకు పని ఒత్తిడిలో ఉన్నవారు చూస్తే కాస్తంత ఉపశమనంగా భావిస్తారు. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా షేర్ చేశారు. ‘దాగుడు మూతల ఆట ఎంత అందమైనది’ అని క్యాప్షన్ పెట్టారు.