ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లనే అలా చేయాల్సి వచ్చింది: శ్రీహాన్
- బిగ్ బాస్ నుంచి 40 లక్షలు అందుకున్న శ్రీహాన్
- అందువలన రేవంత్ కి వెళ్లిన టైటిల్ ట్రోఫీ
- తను తీసుకున్న నిర్ణయం కరక్టేనన్న శ్రీహాన్
- ఆడియన్స్ తన నిర్ణయాన్ని గౌరవించారని వెల్లడి
బిగ్ బాస్ సీజన్ 6 ఇటీవలే ముగిసింది. ఫైనల్స్ కి శ్రీహాన్ - రేవంత్ వెళ్లగా, చివరి నిమిషంలో రేవంత్ విన్నర్ గా నిలిచాడు. 40 లక్షలున్న సూట్ కేస్ ను తీసుకోవడానికి శ్రీహాన్ అంగీకరించడం వలన, టైటిల్ ట్రోఫీ రేవంత్ కి వెళ్లింది. తనకే ఎక్కువ ఓట్లు వచ్చినట్టు నాగార్జున ప్రకటించినప్పుడు మాత్రం, శ్రీహాన్ చాలా ఫీలైనట్టుగా కనిపించాడు.
తాజా ఇంటర్వ్యూలో శ్రీహాన్ మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా రేవంత్ తనకి ట్రోఫీ కావాలనే చెబుతూ వచ్చాడు. నాకు విన్నింగ్ తో పాటు మనీ కూడా చాలా ఇంపార్టెంట్. అంత డబ్బును నేను ఇంతవరకూ అందుకున్నది లేదు. నా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అంతంత మాత్రమే. అందువలన నాకు డబ్బు చాలా అవసరం" అన్నాడు.
నేను బిగ్ బాస్ హౌస్ కి వచ్చిందే మా అమ్మా నాన్నల కోసం. మాకు డబ్బు ఎంత అవసరమనేది మాకు మాత్రమే తెలుసు. అందువల్లనే నాగార్జున సార్ డబ్బు ఆఫర్ చేసినప్పుడు మా పేరెంట్స్ అభిప్రాయం కోసం వెయిట్ చేశాను. వాళ్లు తీసుకోమని చెప్పినప్పుడే నేను తీసుకున్నాను. నా నిర్ణయాన్ని ఆడియన్స్ గౌరవిస్తారనే ఒక నమ్మకంతోనే అలా చేశాను. నేను చేసింది కరెక్టేనని అనుకుంటున్నాను " అంటూ చెప్పుకొచ్చాడు.