డిసెంబరు నెల జీఎస్టీ వసూళ్ల వివరాలు ఇవిగో!

  • జీఎస్టీపై ప్రకటన చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
  • డిసెంబరు మాసంలో 15 శాతం పెరుగుదల
  • గత నెలలో రూ.1.49 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు
  • వరుసగా పదో నెల కూడా రూ.1.4 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ
డిసెంబరు మాసానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నేడు వెల్లడించింది. డిసెంబరులో 15 శాతం పెరుగుదలతో రూ.1,49,507 కోట్ల జీఎస్టీ వసూలైనట్టు తెలిపింది. 

ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.26,711 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ రూ.33,357 కోట్లు అని వివరించింది. సమీకృత జీఎస్టీ రూ.78,434 కోట్లు (దిగుమతులపై వసూలైన పన్నుల మొత్తం రూ.40,263 కోట్లతో కలిపి), సెస్ రూ.11,005 కోట్లు (దిగుమతులపై వసూలైన రూ.850 కోట్లతో కలిపి) వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, జీఎస్టీ ఆదాయం వరుసగా పదో నెల కూడా రూ.1.4 లక్షల కోట్లు దాటడం విశేషం.


More Telugu News