రేపు అభిమానులతో నాని ఫొటో షూట్

  • నాని ఫ్యాన్స్ కు సూపర్ చాన్స్
  • యూసుఫ్ గూడలో అభిమానులతో ఫొటోలు దిగనున్న నాని
  • రేపు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పాసులు
రేపు అభిమానులతో నాని ఫొటో షూట్
నేచురల్ స్టార్ నాని అభిమానులకు బంపర్ అవకాశం లభించింది. అభిమానులతో నాని రేపు ఫొటో షూట్ నిర్వహించనున్నారు. ఈ ఫొటోల కార్యక్రమానికి హైదరాబాద్ యూసుఫ్ గూడలోని మహమూద్ హౌస్ గార్డెన్ వేదికగా నిలవనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్కడే పాసులు అందజేయనున్నారు. పాసుల కోసం ఉప్పు శ్రీనివాసులు (ఫోన్ నెం.8019764224), ప్రదీప్ వజ్రవేల్ (ఫోన్ నెం.798060002)లను సంప్రదించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్. సముద్ర ఖని, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న దసరా చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News