అలా చేయడం వలన నేను చాలా నష్టపోయాను: హీరో శివబాలాజీ
- నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శివబాలాజీ
- తగ్గుతూ వచ్చిన అవకాశాలు
- నిర్మాతగా చూసిన నష్టాలు
- డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని వెల్లడి
శివబాలాజీ ఇండస్ట్రీకి వచ్చి చాలాకాలమే అయింది. హీరోగా .. సెకండ్ హీరోగా చేసిన ఆయన, ముఖ్యమైన పాత్రలను కూడా చేస్తూ వెళుతున్నాడు. మధ్యలో నిర్మాతగా కూడా ప్రయోగం చేశాడు. ఆ తరువాత తన గుమ్మం వరకూ వచ్చిన అవకాశాలను మాత్రమే అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "మొదటి నుంచి సినిమాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉండటం వలన, ఈ దిశగానే ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. మా ఫాదర్ చనిపోయిన తరువాత, అప్పటివరకూ ఆయన నిర్వహస్తూ వస్తున్న ఫ్యాక్టరీని కూడా మూసేశాను. ఆ తరువాత 'ఈము బర్డ్స్' పెంపకానికి సంబంధించిన బిజినెస్ చేశాను.
ఆ బిజినెస్ విషయంలో ముందుగా అనుకున్నట్టు జరగకపోవటం వలన లాస్ కావడం జరిగింది. ఆ తరువాత 'స్నేహమేరా జీవితం' అనే సినిమాను నేనే హీరోగా నిర్మించాను. ఆ సినిమాకి మార్కెటింగ్ ఎలా చేయాలనేది తెలియలేదు. ఆ సినిమా వలన 2 కోట్ల వరకూ నష్టపోయాను. ఆ సమయంలో నాలో నేను బాధపడుతూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. అందులో నుంచి బయటికి రావడానికి చాలా సమయం పట్టింది" అంటూ చెప్పుకొచ్చాడు.