'వాల్తేరు వీరయ్య' ఫోర్ట్ సెట్ కి ఎన్ని వందలమంది పనిచేశారంటే..!
- మాస్ యాక్షన్ మూవీగా 'వాల్తేరు వీరయ్య'
- జాలరి గూడెం నేపథ్యంలో నడిచే కథ
- ప్రధానమైన ఆకర్షణగా నిలవనున్న ఫోర్ట్ సెట్
- ప్రశంసలు అందుకుంటున్న ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాశ్
- ఈ నెల 13వ తేదీన విడుదలవుతున్న సినిమా
చిరంజీవిని పక్కా మాస్ లుక్ తో చూడాలని కొంతకాలం నుంచి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఆయన అభిమాని అయిన బాబీ కూడా చిరంజీవిని అలాగే చూపించాలని నిర్ణయించుకున్నాడు. అలా రూపొందిన సినిమానే 'వాల్తేరు వీరయ్య'. ఇది సముద్రం నేపథ్యంలో .. జాలరి గూడెం బతుకుల చుట్టూ తిరిగే కథ. అందువలన ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాశ్ చేత ఫోర్ట్ సెట్ ను వేయించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఎప్పటినుంచో మెగాస్టార్ సినిమాకి వర్క్ చేయాలనేది నా డ్రీమ్. ఆ ముచ్చట ఈ సినిమాతో తీరింది. కథ వింటున్నప్పుడే సెట్ ఎలా ఉండాలనే ఒక విషయంలో నాకు క్లారిటీ వచ్చేసింది" అని అన్నారు. "ఫోర్ట్ సెట్ కి అయ్యే ఖర్చు నిర్మాతలకు అందుబాటులో ఉండాలి. అలాగే చిరంజీవిగారి క్రేజ్ కి తగినట్టుగా ఉండాలి. బడ్జెట్ పరిధి దాటకూడదు .. భారీతనం తగ్గకూడదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సెట్ వేయడం జరిగింది. ఈ సెట్ కోసం రెండు నెలల పాటు 300 మంది నుంచి 400 మంది వరకూ రెగ్యులర్ గా పనిచేశారు. ఈ సినిమాలోని ఒక పాట కోసం వేసిన ఈ సెట్, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.