అమెజాన్ ప్రైమ్ లో ఐక్యూ 11 అమ్మకాలు
- చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ నుంచి కొత్త ఫోన్
- బెస్ట్ గేమింగ్ అనుభూతి పొందొచ్చంటున్న కంపెనీ
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఐక్యూ నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. భారత వినియోగదారుల కోసం అమెజాన్ లో అమ్మకాలు మొదలు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ రూ.1000 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ప్రకటించింది. ఐక్యూ 11 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ సామర్థ్యంతో విడుదలైన వేరియంట్ ధరను కంపెనీ రూ.59,999 గా నిర్ణయించింది. 16 జీబీ ర్యామ్, 256 స్టోరేజీ స్మార్ట్ ఫోన్ ధరను రూ.64,999 గా పేర్కొంది. వీటిపై తన ప్రైమ్ ఖాతాదారులకు అమెజాన్ రూ.1000 డిస్కౌంట్ ఇస్తోంది.
ఐక్యూ 11 ప్రత్యేకతలు..
ఐక్యూ 11 ప్రత్యేకతలు..
- డిస్ ప్లే: 6.78 ఇంచుల అమో ఎల్ఈడీ, 144 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్, 2కె ఈ6 ప్యానెల్ తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదే!
- కెమెరా: ట్రిపుల్ కెమెరా సెటప్.. 50 మెగా పిక్సెల్ సామ్ సంగ్ జీఎన్5 లెన్స్, 13 ఎంపీ టెలిఫొటో లెన్స్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్
- సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ స్నాపర్. బెస్ట్ గేమింగ్ అనుభూతిని అందించేందుకు డ్యూయల్ x-లీనియర్ మోటార్
- బ్యాటరీ: 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ