శుభ్ మాన్ గిల్ సెంచరీ... భారీ స్కోరు దిశగా భారత్
- తిరువనంతపురంలో మూడో వన్డే
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- శ్రీలంక బౌలర్లపై గిల్ వీరవిహారం
- వన్డేల్లో రెండో సెంచరీ నమోదు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ సెంచరీ సాధించడంతో భారత్ కు శుభారంభం లభించింది. గిల్ 97 బంతుల్లో 14 ఫోర్లు 2 సిక్సర్లతో 116 పరుగులు చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో గిల్ కు ఇది రెండో సెంచరీ.
మరో ఓపెనర్ రోహిత్ వర్మ 42 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 95 పరుగులు జోడించి పటిష్ట పునాది వేశారు. వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ తనదైన శైలిలో ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు.
ప్రస్తుతం టీమిండియా 35 ఓవర్లలో 2 వికెట్లకు 235 పరుగులు చేసింది. కోహ్లీ 66, శ్రేయాస్ అయ్యర్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. లంక బౌలర్లలో కసున్ రజిత 1, చామిక కరుణరత్నే 1 వికెట్ తీశారు.