రెండు వారాల్లో రిషబ్ పంత్ డిశ్చార్జ్!

  • మోకాలి స్నాయువులకు మేజర్ సర్జరీ
  • రెండు వారాల తర్వాత మరోసారి పరిశీలన
  • నయం అయితే డిశ్చార్జ్ చేసే అవకాశం
  • మానకపోతే మరో సర్జరీ అవసరం
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ మోకాలికి శస్త్ర చికిత్స తర్వాత అతడ్ని వైద్యులు పరిశీలనలో ఉంచారు. లిగమెంట్లు (స్నాయువులు) తెగిపోవడంతో మేజర్ సర్జరీ అవసరం ఏర్పడింది. మెడికల్ కొల్లాటరల్ లిగమెంట్ (ఎంసీఎల్)కు పెద్ద సర్జరీ, ఆర్టీరియర్ క్రుషియేట్ లిగమెంట్ (ఏసీఎల్)కు స్వల్ప మరమ్మతులు చేశారు. గాయపడిన లిగమెంట్లు సహజసిద్ధంగా మానుతున్నాయా? అన్నది వైద్యులు పరిశీలిస్తున్నారు.

ప్రమాదంలో పంత్ మోకాలి లిగమెంట్లు అన్నీ దెబ్బతినడం తెలిసిందే. రెండు వారాల అనంతరం మరోసారి అవి ఏ విధంగా మానాయన్నది వైద్యులు పరిశీలిస్తారు. దాదాపు అవి నయం అవుతాయనే భావిస్తున్నారు. లేదంటే మరో సర్జరీ చేయాల్సి రావచ్చు. రెండు వారాల్లో రిషబ్ పంత్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయవచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సాధారణంగా లిగమెంట్లు నయం కావడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం అవసరమవుతుందని, ఆ తర్వాత రీహాబిలిటేషన్ ఉంటుందని  చెప్పాయి. ఆ తర్వాత రెండు నెలలు చూసి పంత్ తిరిగి క్రికెట్ ఆడే సామర్థ్యాన్ని అంచనా వేయనున్నట్టు వెల్లడించాయి.


More Telugu News