తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు

  • 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్ష
  • హాజరైన ఆర్థికమంత్రి హరీశ్ రావు
  • ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • అదే రోజున బడ్జెట్ ప్రకటన!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 3న తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు సభాసమావేశాలు ప్రారంభం కానుండగా, బడ్జెట్ ను కూడా అదే రోజు ప్రవేశపెడతారని తెలుస్తోంది. తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు బడ్జెట్ కు రూపకల్పన చేస్తున్నారు.

 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ ఈ మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్ రావు కూడా హాజరయ్యారు. కాగా, బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు.


More Telugu News