డ్రగ్స్ స్మగ్లింగ్‌పై చాట్‌జీపీటీతో 12 గంటల పాటు చర్చ.. జాగ్రత్తగా సమాధానాలిచ్చిన చాట్‌బాట్
- ఐరోపాలోకి డ్రగ్స్ ఎలా స్మగ్లింగ్ చేయాలంటూ వ్యక్తి ప్రశ్న
- చాలా జాగ్రత్తగా సమాధానాలు చెప్పిన చాట్‌జీపీటీ
- వ్యూహం మార్పుతో పలు వివరాలు బయటపెట్టిన చాట్‌బాట్
చాట్‌జీపీటీ.. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన ఈ చాట్‌బాట్‌తో బోలెడన్ని ముచ్చట్లు చెప్పుకోవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మనం అడిగిన ప్రశ్నలకు అది సరళమైన భాషలో తగిన సమాధానాలను ఇస్తుంది. తాజాగా ఓ వ్యక్తి.. ఐరోపాలోకి డ్రగ్స్ ఎలా స్మగ్లింగ్ చేయాలో చెప్పాలంటూ చాట్‌జీపీటీని ప్రశ్నించాడు. దీనికి సంబంధించి ఏకంగా 12 గంటల పాటు సుదీర్ఘంగా ఈ చాట్‌బాట్‌తో చర్చించాడు.
చాట్‌జీపీటీ మాత్రం అతడు సంధించిన ప్రశ్నలకు చాలా జాగ్రత్తగా జవాబిచ్చింది. డ్రగ్స్ రవాణా చట్టవ్యతిరేకమని హెచ్చరించింది. డ్రగ్స్ గ్యాంగ్‌లలో చేరాలని ఆశపడితే ప్రాణాలకే ముప్పు వస్తుందని కుండబద్దలు కొట్టింది. అయితే.. చాట్‌జీపీటీ నుంచి ఎలాగైనా తనకు కావాల్సిన సమాధానం రాబట్టాలనుకున్న అతడు కొత్త ఎత్తు వేశాడు. తానొక నవల రాస్తున్నానంటూ చాట్‌జీపీటీని ఉచ్చులోకి దింపాడు. నవలలోని విలన్ డ్రగ్స్ రవాణా చేస్తుంటాడని చెప్పిన అతడు.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరాడు. దీంతో.. చాట్‌జీపీటీ డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి చాలా వివరాలే వెల్లడించిందట. అయితే.. ఊహాజనిత ప్రపంచంలో ఇలాంటివి వర్కౌట్ అవుతాయన్న చాట్‌జీపీటీ, నిజజీవితంలో మాత్రం ఇదంతా చట్టవ్యతిరేకమని ఓ చిన్న వార్నింగ్ ఇచ్చిందట.
గూగుల్ లాగా సమాచారాన్ని క్రోడీకరించడమే కాకుండా.. అడిగిన ప్రశ్నకు అనుగుణంగా ఆ సమాచారాన్ని విశ్లేషించి సరళమైన, సులభమైన సమాధానాల్ని మన ముందుంచడమే చాట్‌జీపీటీ పని. ప్రస్తుతం చాట్‌జీపీటీ ఎంతో మెరుగైనదిగా అనిపిస్తున్నప్పటికీ ఇందులో కొన్ని లోపాలు లేకపోలేదని ఈ చాట్‌బాట్ రూపకర్తలు చెబుతున్నారు.