గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడి
- చంద్రబాబును విమర్శించిన వంశీ
- వంశీపై అదే రీతిలో విమర్శలు చేసిన టీడీపీ నేతలు
- ఆగ్రహం వ్యక్తం చేసిన వంశీ అనుచరులు
- టీడీపీ కార్యాలయంలో సామగ్రి ధ్వంసం
- టీడీపీ ఆఫీసు ఆవరణలో కారుకు నిప్పంటించిన వైనం
గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. చంద్రబాబును ఎమ్మెల్యే వంశీ విమర్శించడంతో రగడ మొదలైంది. వంశీపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీపై అదేస్థాయిలో విమర్శలు గుప్పించారు.
దాంతో, మా నాయకుడినే విమర్శిస్తారా? అంటూ వంశీ అనుచరులు మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. టీడీపీ కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఆఫీసు ఆవరణలో ఉన్న కారుకు నిప్పంటించారు.