స్టార్ హీరోయిన్స్ ను కంగారుపెడుతున్న జాన్వీ కపూర్!

  • యూత్ లో జాన్వీ కపూర్ కి మంచి క్రేజ్ 
  • ఆమె టాలీవుడ్ ఎంట్రీ కోసం అంతా వెయిటింగ్ 
  • ఎన్టీఆర్ 30వ సినిమా కోసం సెట్స్ పైకి రానున్న జాన్వీ 
  • ఇక్కడ ఆమె బిజీ కావడం ఖాయమంటూ టాక్ 
అతిలోక సుందరి అనిపించుకున్న శ్రీదేవి, తెలుగుతో పాటు వివిధ భాషా చిత్రాలలో నటించారు. బాలీవుడ్ లో అంతకాలం పాటు నెంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిప్పినవారు లేరు. శ్రీదేవి ఎన్ని భాషల్లో నటించినా, ఆమె తెలుగు ప్రేక్షకుల సొంత మనిషి అన్నట్టుగానే అంతా భావిస్తారు .. ఆరాధిస్తారు. అలాంటి శ్రీదేవి కూతురు ఎన్టీఆర్ జోడీగా ఒక సినిమా చేయనుందనే వార్త బయటికి రాగానే శ్రీదేవి అభిమానులంతా సంతోషంతో పొంగిపోయారు.

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే చాలా ఆలస్యం చేసిందని అనుకునేవారు లేకపోలేదు. ఫలానా ఫలానా హీరోల సరసన నటించడానికి అంగీకరించిందనే వార్తలు చాలా కాలం నుంచి వస్తున్నప్పటికీ, ఆమె కొరటాల సినిమాలో ఎన్టీఆర్ జోడీగా చేయనుందనే విషయమే ఖాయమైంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్స్ పరిచయమయ్యారు. కానీ జాన్వీ పరిస్థితి వేరు .. శ్రీదేవి పట్ల గల అభిమానాన్ని కలుపుకునే ఆమెను చూస్తారు. ఈ పాన్ ఇండియా సినిమా తరువాత ఆమె బిజీ కావడం ఖాయం. అందువలన మిగతా స్టార్ హీరోలు కూడా తమ నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం ఆమెతో సంప్రదింపులు జరిపిస్తున్నారని తెలుస్తోంది. ఇదంతా చూసి .. మిగతా హీరోయిన్స్ కంగారు పడుతున్నారని టాక్. 


More Telugu News