‘మన్‌కీ బాత్’ 100వ ఎపిసోడ్‌పై బీజేపీ బిగ్‌ప్లాన్!
- 3 అక్టోబరు 2014లో ప్రారంభమైన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం
- ఏప్రిల్ చివరి వారంతో 100 ఎపిసోడ్లు పూర్తి
- ‘మన్ కీ బాత్’లో మోదీ ఇప్పటి వరకు ప్రస్తావించిన వ్యక్తులకు సన్మానం చేయాలని నిర్ణయం
- వందో ఎపిసోడ్‌ను ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని యోచన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతి నెల చివరి ఆదివారం రేడియో ద్వారా చేసే ‘మన్ కీ బాత్’ వందో ఎపిసోడ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఏప్రిల్ చివరి వారంలో మోదీ చేసే ప్రసంగంతో ఈ కార్యక్రమం 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌ను ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని భావిస్తోంది. అంతేకాదు, మోదీ తన ‘మన్ కీ బాత్’లో ఇప్పటి వరకు ప్రస్తావించిన వ్యక్తులను ఢిల్లీకి ఆహ్వానించి సత్కరించనుంది.
అలాగే, దేశవ్యాప్తంగా 100 ప్రాంతాలను ఎంపిక చేసి, అక్కడ ఉన్న 100 మంది ప్రముఖులను ఆహ్వానించి ‘మన్ కీ బాత్’ వినిపిస్తారు. బీజేపీకి చెందిన 100 బూత్‌లలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వినిపిస్తారు. 3 అక్టోబరు 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏప్రిల్ 30తో వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటుంది.