మెగా క్లాప్ తో మొదలైన నితిన్ న్యూ ప్రాజెక్ట్!
- నితిన్ హీరోగా కొత్త ప్రాజెక్టు మొదలు
- ఆయనతో మరోసారి జోడీకడుతున్న రష్మిక
- సంగీతాన్ని అందిస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్
- 'భీష్మ' తరువాత వెంకీ కుడుముల చేస్తున్న సినిమా
నితిన్ - రష్మిక కాంబినేషన్లో గతంలో వచ్చిన 'భీష్మ' భారీ విజయాన్ని సాధించింది. నితిన్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. ఆ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్లో మరో ప్రాజెక్టు పట్టాలెక్కింది.
ఈ రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. చిరంజీవి క్లాప్ తో ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలైంది. బాబీ .. గోపీచంద్ మలినేని .. హను రాఘవపూడి .. బుచ్చిబాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
'భీష్మ' సినిమా 2020లో వచ్చింది. ఆ తరువాత నితిన్ వరుస సినిమాలు చేస్తూ వెళ్లినా హిట్ పడలేదు. ఇక ఆ సినిమా తరువాత వెంకీ కుడుముల నుంచి మరో ప్రాజెక్టు రాలేదు. ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాతో, మరో బ్లాక్ బస్టర్ దొరుకుతుందేమో చూడాలి.