సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రపంచ బ్యాంకు డైరెక్టర్

  • సీఎం జగన్ ను కలిసిన ప్రపంచ బ్యాంకు బృందం
  • ఏపీలో చేపడుతున్న పథకాల పట్ల సంతృప్తి
  • సీఎం జగన్ తన విజన్ ను తమతో పంచుకున్నారన్న అగస్టే కౌమే
  • రాష్ట్రంలో అభివృద్ధిని కళ్లారా చూశానని వెల్లడి
ప్రపంచ బ్యాంకు భారత విభాగం డైరెక్టర్ అగస్టే కౌమే నేతృత్వంలోని బృందం ఏపీ సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఏపీలో వరల్డ్ బ్యాంకు భాగస్వామ్యంతో నడుస్తున్న పలు పథకాల అమలుపై వారు సీఎం జగన్ తో చర్చించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకువస్తున్నామని, పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నామని సీఎం జగన్ వరల్డ్ బ్యాంకు బృందంతో చెప్పారు. రాష్ట్రాభివృద్ధి దిశగా ప్రపంచ బ్యాంకు మరింత సహకారం అందించాలని కోరారు. 

ఈ నేపథ్యంలో, తమ భేటీపై వరల్డ్ బ్యాంకు భారత విభాగం డైరెక్టర్ అగస్టే కౌమే ట్విట్టర్ లో స్పందించారు. ఏపీ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ తన విజన్ ను తమతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. వణుకూరు, భవానీపురం, వెనిగండ్ల ప్రాంతాల్లో తాను పర్యటించానని, ఆరోగ్యం, విద్య అంశాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలను కళ్లారా చూశానని కౌమే వెల్లడించారు. ఏపీ సుస్థిర భవిష్యత్తు పెట్టుబడులకు అభివృద్ధి, అధిక రెవెన్యూ తోడ్పడతాయని వివరించారు.


More Telugu News