అంతపెద్ద ఎన్టీఆర్ గారు నన్ను సముదాయించారు: 'లవకుశ' సెట్లో సంఘటన గురించి సుబ్రహ్మణ్యం
- 'లవకుశ'లో కుశుడుగా నటించిన సుబ్రహ్మణ్యం
- సినిమా హిట్ తరువాత ఎలాంటి సాయం అందలేదని
వ్యాఖ్య - తమని అంజలీదేవి ప్రేమతో చూసుకున్నారని వెల్లడి
- తాను ఏడుస్తుంటే ఎన్టీఆర్ సముదాయించారని వివరణ
'లవకుశ' సినిమా గురించిన విశేషాలను ఆ సినిమాలో 'కుశుడు' పాత్రను పోషించిన సుబ్రహ్మణ్యం తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. 'లవ కుశ ' సినిమా భారీ విజయాన్ని సాధించినప్పటికీ, ఆర్ధికంగా మాకు ఎలాంటి సహాయం అందలేదు. అయినా ఆ సినిమాలో చేయడమే అదృష్టంగా భావించాము. ఆ సినిమా సమయంలో అంజలీదేవిగారు నిజంగానే మమ్మల్ని కన్నబిడ్డల మాదిరిగా చూశారు" అన్నారు.
"సీతాదేవి భూమిలోకి వెళ్లిపోయే సన్నివేశాన్ని సీఎస్ రావుగారు చిత్రీకరించారు. ప్రళయం మాదిరిగా ఒక వైపున విపరీతమైన గాలి వస్తుంటుంది .. భూమి బద్దలవుతూ ఉంటుంది. మరో వైపున రామారావుగారు 'సీతా .. సీతా' అని అరుస్తూ ఉంటారు. మేము 'అమ్మా .. అమ్మా' అని అరుస్తూ ఉండాలి. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి అప్పట్లోనే చాలా పెద్దమొత్తాన్ని ఖర్చు చేశారు.
'అయితే భూమి బద్దలవుతూ ఉండటం చూస్తూ .. మేము డైలాగ్ చెప్పడం మరిచిపోయాము. దాంతో సీఎస్ రావుగారు కోపంతో అరిచేశారు. అప్పుడు నాకు కోపం వచ్చేసి .. బాణాలు అక్కడ పడేసి ఏడుస్తూ వెళ్లిపోయాను. అప్పుడు అంత పెద్దాయన ఎన్టీఆర్ వచ్చి నన్ను సముదాయించారు. కుర్రాడి మూడ్ బాగోలేదు .. షూటింగు ఈ రోజు వద్దులే .. రేపు పెట్టుకుందాం అన్నారు" అంటూ గుర్తుచేసుకున్నారు.