రికార్డు స్థాయిలో అమ్ముడు పోయిన ఎలక్ట్రిక్ వాహనాలు
- మార్చిలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో 85,802 యూనిట్ల అమ్మకాలు
- ఫిబ్రవరి నెల కంటే 30 శాతం అధిక విక్రయాలు
- మొదటి మూడు స్థానాల్లో ఓలా, టీవీఎస్, ఏథర్
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన అమ్మకాలు ప్రతి నెలా కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో 85,802 యూనిట్ల ఎలక్ట్రిక్ టూ వీలర్లు అమ్మడయ్యాయి. ఒక నెలలో ఈ స్థాయి రికార్డు అమ్మకాలు ఇదే మొదటిసారి. 2022-23 మొత్తం మీద 7,26,551 యూనిట్ల ఎలక్ట్రిక్ టూ వీలర్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 2021-22 గణాంకాలతో పోలిస్తే 2.8 రెట్లు ఎక్కువ.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 65,979 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరిగాయి. దీంతో పోలిస్తే మార్చి నెలలో 30 శాతం అధిక అమ్మకాలు నమోదయ్యాయి. ఇక 2022 మార్చి నెలలో అమ్మకాలు 54,400యూనిట్లతో పోలిస్తే 60 శాతం వృద్ధి నమోదైంది. నిజానికి ఈ గణాంకాల్లో 30 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు, అలాగే, తెలంగాణ, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ విక్రయ గణాంకాలను పరిగణనలోకి తీసుకోలేదు.
మార్చిలో ఓలా ఎలక్ట్రిక్ 21,274 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో ఉంది. టీవీఎస్ కంపెనీ 16,779 యూనిట్ల ఐక్యూబ్ లను విక్రయించింది. ఆ తర్వాత ఏథర్ విక్రయాలు 12,079 యూనిట్లుగా ఉన్నాయి. యాంపియర్ ఈవీ 9,335, హీరో ఎలక్ట్రిక్ 6,653 యూనిట్లు, ఒకినవా 4,505 యూనిట్ల చొప్పున అమ్మకాలు చేశాయి. రివోల్ట్ మోటార్ 1,132 యూనిట్లను డెలివరీ చేసింది.