విక్టరీ వెంకటేశ్ బాబాయి దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూత

  • దగ్గుబాటి మోహన్ బాబు నిర్మాత రామానాయుడికి తమ్ముడు
  • ఆయన వయసు 73 సంవత్సరాలు
  • వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న వైనం
  • కారంచేడులోని స్వగృహంలో మృతి
విక్టరీ వెంకటేశ్ బాబాయి దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూత
టాలీవుడ్ అగ్రహీరో వెంకటేశ్ బాబాయి దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూశారు. దగ్గుబాటి మోహన్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడికి తమ్ముడు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బాపట్ల జిల్లా కారంచేడులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దగ్గుబాటి కుటుంబం స్వస్థలం కారంచేడు అని తెలిసిందే. 

దగ్గుబాటి మోహన్ బాబు అంత్యక్రియలు కారంచేడులో రేపు సాయంత్రం జరగనున్నాయి. బాబాయి మృతి నేపథ్యంలో నిర్మాత సురేశ్ బాబు, ఆయన తనయుడు అభిరామ్ కారంచేడు వెళ్లి నివాళులు అర్పించారు. షూటింగ్ లో ఉన్న వెంకటేశ్ రేపు ఉదయం కారంచేడు చేరుకుంటారని తెలుస్తోంది.


More Telugu News