వర్షంలో పేదలకు వస్తు పంపిణీ చేసిన నయనతార
- చెన్నైలోని వీధుల్లో దర్శనమిచ్చిన నయనతార, విఘ్నేష్ శివన్
- వర్షంలో షెల్టర్ల కింద ఉన్న పేదలకు వస్తు సామగ్రి అందజేత
- లేడీ సూపర్ స్టార్ అంటూ అభిమానుల ప్రశంసలు
నయనతార సేవా భావం గురించి ఆమె అభిమానులకు పరిచయమే. వీలు కుదిరినప్పుడల్లా ఆమె భర్త విఘ్నేష్ శివన్ తో కలసి చెన్నై నగరంలోని పేదలకు సాయం చేస్తుంటుంది. ఎక్కువగా వీధుల్లో ఒంటరిగా కనిపించే పేదలకు వస్తు సామాగ్రిని పంచుతుంది. ఇదే మాదిరి మరోసారి నయనతార తన సేవాభావాన్ని చాటుకుంది.
ఓ వైపు వర్షం కురుస్తుండగా.. భర్తతో కలసి ఆమె వీధుల్లోని వారికి వస్తు సామగ్రిని అందించింది. వర్షం పడుతున్న సమయంలో బస్ షెల్టర్ వద్ద సేదతీరుతున్న వారికి సామాగ్రి అందిస్తున్న వీడియో ఒకటి ట్విట్టర్ లోకి చేరింది. భర్త విఘ్నేష్ శివన్ ఒక చేత్తో గొడుగు పట్టుకోగా, మరో చేత్తో కవర్ లను పట్టుకున్నాడు. నయనతార ఒక్కోటీ తీసుకుని అక్కడున్న పేదలకు అందిస్తోంది. నయనతార టీ షర్టు, చిరిగిపోయిన జీన్స్ ధరించి ఉంది.
ఈ వీడియోని చూసిన అభిమానులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. నిజంగా లేడీ సూపర్ స్టార్ అని ఒకరు అంటే.. వర్షంలో గూడు లేని పేదలకు సాయం చేస్తోందని కొందరు ప్రశంసిస్తున్నారు. గోల్డెన్ హార్ట్ ఉన్న వ్యక్తి అని మరో యూజర్ పేర్కొనడం గమనార్హం. నయనతార, విఘ్నేశ్ శివన్ ఇటీవలే కుంభకోణంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకోవడం తెలిసిందే. తిరుగు ప్రయాణంలో రైలులో ఆమెను ఓ అభిమాని వీడియో తీయబోతుండగా, నయనతార తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని చూసే ఉంటారు.