అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు నన్ను పిలవలేదు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై
- తనను ఆహ్వానించి ఉంటే వెళ్లేదాన్నన్న తమిళిసై
- రాజ్ భవన్ లోనే అంబేద్కర్ కు నివాళులు అర్పించానని వెల్లడి
- చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య విభేదాలు
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదం చాలా రోజులుగా కొనసాగుతోంది. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై ఇటీవల సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై హాజరుకాలేదు.
ఈ నేపథ్యంలో, శనివారం ఓ కార్యక్రమంలో తమిళిసై మాట్లాడుతూ.. తాను ఎందుకు హాజరుకాలేదనే దానికి వివరణ ఇచ్చారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తనకు ఆహ్వానం రాలేదని అన్నారు. పిలిచి ఉంటే వెళ్లేదాన్నని చెప్పారు. అంబేద్కర్ ఎక్కువగా మహిళల గురించి, మహిళా హక్కుల గురించి మాట్లాడారని, అలాంటి వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఒక మహిళా గవర్నర్ కి ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యకరమని చెప్పారు.
అందుకే రాజ్ భవన్ లోనే అంబేద్కర్ కు నివాళులు అర్పించానని తెలిపారు. గ్రహాల మధ్య సూర్యుడు ఉన్నట్లు.. కొంత మంది రాజకీయ నాయకులు వారి కొడుకులను మధ్యలో ఉంచాలని అనుకుంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.