వజ్రం లోపల వజ్రం... సూరత్ సంస్థ వద్ద అత్యంత అరుదైన డైమండ్
- అత్యంత అరుదైన వజ్రాన్ని సేకరించిన వీడీ గ్లోబల్ సంస్థ
- వజ్రం లోపల ఖాళీ ప్రదేశం
- అందులో గోలీ మాదిరిగా కదులుతూ మరో వజ్రం
- బీటింగ్ హార్ట్ అని నామకరణం
చిన్న వజ్రం ముక్కతో కోటీశ్వరులైపోవచ్చు. ప్రపంచంలో వజ్రానికి ఉన్న విలువ అటువంటిది. వజ్రాల స్వచ్ఛతను బట్టి వాటి విలువ మారుతుంటుంది. వాటి రంగు కూడా ధరలో ప్రముఖ పాత్ర పోషిస్తుంటుంది. ఇక గుజరాత్ లోని సూరత్ అంటే మేలిమి వజ్రాలకు చిరునామా. అక్కడ అనేక సంస్థలు డైమండ్ కటింగ్ పరిశ్రమలు నెలకొల్పి, వజ్రాలను ఎగుమతి చేస్తూ విదేశాల నుంచి భారీగా ఆర్జిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, సూరత్ కు చెందిన వీడీ గ్లోబల్ అనే సంస్థ వద్దకు అత్యంత అరుదైన వజ్రం చేరింది. వజ్రం లోపల మరో వజ్రం ఉండడంతో దీనికి విశిష్టత ఏర్పడింది. అంతేకాదు, ఆ వజ్రం లోపల ఖాళీ స్థలంలో ఉన్న చిన్న వజ్రం ఓ గోలీ మాదిరిగా కదులుతుండడంతో ఇదొక విచిత్రమైన వజ్రంగా భావిస్తున్నారు. దీన్ని వీడీ గ్లోబల్ సంస్థ గతేడాది అక్టోబరులో గుర్తించింది.
ఇది 0.329 క్యారట్ శ్రేణికి చెందిన వజ్రం. ఇలాంటి వజ్రాన్ని తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని వీడీ గ్లోబల్ సంస్థ చైర్మన్ వల్లభ్ వఘాసియా వెల్లడించారు. దీనికి 'బీటింగ్ హార్ట్ అని పేరు పెట్టినట్టు తెలిపారు. ప్రముఖ వజ్రాల ఆభరణాల సంస్థ డీ బీర్స్ తో వీడీ గ్లోబల్ అనుబంధంగా పనిచేస్తుంది. ఈ అరుదైన వజ్రం వివరాలను డీ బీర్స్ కు పంపించినట్టు వఘాసియా పేర్కొన్నారు. అంతేకాదు, ఈ వజ్రాన్ని మరింత విశ్లేషించేందుకు బ్రిటన్ పంపించారు.
కాగా, డీ బీర్స్ గ్రూప్ ఇగ్నైట్ కు చెందిన టెక్నికల్ ఎడ్యుకేటర్ సమంత సిబ్లే కూడా వజ్రం లోపల వజ్రం ఉండడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. వజ్రాల రంగంలో గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నానని, ఇప్పటిదాకా ఈ బీటింగ్ హార్ట్ తరహా వజ్రాన్ని ఎక్కడా చూడలేదని తెలిపారు.
ఇలాంటి అరుదైన వజ్రమే కొన్నాళ్ల కిందట రష్యాలోని సైబీరియాలో లభ్యమైనట్టు తెలుస్తోంది. దాన్ని మాట్రియోష్కా వజ్రంగా పిలుస్తారు.