తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ఫోకస్
- తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో నేడు కేంద్ర ఈసీ బృందం భేటీ
- అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై సూచనలు చేసిన ఈసీ
- ఆర్వోల జాబితా త్వరగా సిద్ధం చేయాలని సూచన
- ఈవీఎంల తనిఖీలు, జిల్లా ఎన్నికల అధికారులకు వర్క్ షాపులు ప్రారంభించాలని ఆదేశం
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంపై దృష్టి సారించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర ఐసీ బృందం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయంలో నేడు కీలక భేటీ నిర్వహించింది. ఈసీ బృందానికి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్‌తో పాటు ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణ, సిబ్బంది శిక్షణపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం పలు కీలక సూచనలు చేసింది. జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు రెండ్రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించాలని సూచించింది. ఓటర్ల జాబితాలో మార్పులుచేర్పులను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పింది. రిటర్నింగ్ అధికారుల జాబితాను సిద్ధం చేయాలని, జూన్ 1 నుంచి ఆర్వోలు ఈవీఎంల తనిఖీలు ప్రారంభించాలని ఆదేశించింది. వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని కూడా సూచించింది.