ఎంఎస్ ధోనీ మైదానంలో లేనప్పుడే ఆ లోటు తెలుస్తుంది: ఇయాన్ మార్గ్

  • ధోనీలో ఇప్పటికీ ఎంతో ఎనర్జీ ఉందన్న మోర్గాన్
  • అతడిని సారథిగా కలిగి ఉన్నందుకు గర్వపడాలని వ్యాఖ్య
  • ఆటగాళ్లను నడిపించే విషయంలో అతడి పాత్ర కీలకమన్న అభిప్రాయం
తాను కెరీర్ లో చివరి దశలో (రిటైర్మెంట్ కు దగ్గర్లో) ఉన్నానంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రకటన ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. 42 ఏళ్ల వయసుకు సమీపిస్తున్నా ధోనీ మంచి ఫిట్ నెస్ తో చైన్నై జట్టు తరఫున అదరగొడుతున్నాడు. ఎంఎస్ ధోనీ అంటే ఎంతో మంది ఆటగాళ్లకు గౌరవం, అభిమానం. కూల్ గా, ప్రొషెషనల్ గా ఉండే ధోనీ చేసిన ప్రకటనతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పందించాడు.

ఎంఎస్ ధోనీ  2023 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంతో ఆస్వాదిస్తున్నాడని వ్యాఖ్యానించాడు. అతడు మైదానంలో లేనప్పుడు ఆటగాళ్లకు అతడి లేని లోటు బాగా తెలుస్తుందన్నాడు. శుక్రవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్ రైజర్స్ తో మ్యాచ్ తర్వాత ధోనీ ఎంతో ఉత్సాహంగా మాట్లాడినట్టు మోర్గాన్ గుర్తు చేశాడు. అతడిలో ఉన్న ఎనర్జీని ప్రస్తావించాడు. సంబంధిత జట్టును నడిపించే విషయంలో అతడు ఎంత ఆస్వాదిస్తున్నాడో తెలుస్తోందన్నాడు. 

‘‘ధోనీని సారథిగా కలిగి ఉన్నందుకు వారు గర్వపడాలి. కానీ, అతడు వెళ్లిపోయినప్పుడే ఏమి కోల్పోయామన్నది తెలుస్తుంది. తనవైపు ఆటగాళ్లను నడిపించే విషయంలో, వారిని ప్రోత్సహించడంలో అతడు చూపించే ప్రభావం ఎంతో కీలకం. అతడి కెరీర్ ముగిసిన తర్వాత వారు అతడ్ని మిస్ అవుతారు’’ అని ఇయాన్ మోర్గాన్ అన్నాడు.


More Telugu News