మీలాంటి సాహస యోధుడి ఆలోచనలకు సహచరుడినై ఉండాలని కోరుకుంటా.. పవన్ కల్యాణ్ కు సముద్ర ఖని లెటర్!
- నిన్న సముద్ర ఖని పుట్టిన రోజు సందర్భంగా విష్ చేసిన పవన్ కల్యాణ్
- ‘మా బంగారు గని’ అంటూ పవన్ లేఖ విడుదల
- ధన్యవాదాలు చెప్పిన సముద్రఖని
విలక్షణ నటుడు, రచయిత, దర్శకుడు సముద్రఖని నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు. ఈ రోజు ట్విట్టర్ వేదికగా సముద్రఖని దానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఓ లేఖను విడుదల చేశారు.
నిన్న పవన్ కల్యాణ్ విడుదల చేసిన లేఖలో.. ‘‘ప్రతిభావంతుడైన దర్శకుడు, రచయిత, నటుడు, మా బంగారు గని సముద్రఖనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి అయిన సముద్రఖని మానవ సంబంధాలపై విశ్వాసం ఉన్నవారు. అందుకే ఆయన చిత్రకథల్లో ఆ భావనలు కనిపిస్తాయి. నేను నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రంలో ఒక ముఖ్య భూమిక పోషించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’’ అని తెలిపారు.
దీనికి సముద్రఖని బదులిచ్చారు. ‘‘అన్నయ్యా.. నా పట్ల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని. మీతో నటుడిగా, దర్శకుడిగా ఈ ప్రయాణం ఎన్నో మంచి విషయాలను నేర్పించింది. మరింత గొప్పగా కొనసాగేందుకు కావలసిన ధైర్యాన్ని, చైతన్యాన్ని నాలో నింపింది’’ అని పేర్కొన్నారు.
‘‘సమాజం పట్ల మీకున్న ప్రేమ, అక్కర నన్ను మీ వ్యక్తిత్వానికి అభిమానినయ్యేలా చేశాయి. సదా మీలాంటి సాహస యోధుడి ఆలోచనలకు, దృక్పథానికి సహచరుడినై ఉండాలని కోరుకుంటాను. ప్రజాశ్రేయస్సుకై మీరు కలలుగనే మార్పు సాకారమై, తెలుగు రాష్ట్రాలకే కాక యావత్ భారతదేశానికి మేలు జరిగే దిశగా ఆ భగవంతుడు మిమ్మల్ని నడిపించాలని, మీకు శక్తి ప్రసాదించాలని ప్రార్థిస్తాను’’ అని సముద్రఖని తన లేఖలో రాసుకొచ్చారు.
సముద్రఖని దర్శకత్వంలో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్‌లో హీరోలుగా ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ‘వినోదాయ సితం’ అనే తమిళ సినిమాలో సముద్ర ఖని తానే నటించి, దర్శకత్వం వహించారు. దీన్ని తెలుగులో మామా అల్లుళ్లతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పవన్ షూటింగ్ పోర్షన్ అంతా పూర్తయినట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు.