అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్ కు రాడు: కారణం చెప్పిన డ్వేన్ బ్రావో

  • 7, 8 స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తున్న ధోనీ
  • జడేజా, దూబే లాంటి వాళ్లకు ఎక్కువ చాన్స్ లు ఇవ్వాలనే అలా చేస్తున్నాడన్న బ్రావో
  • ఫినిషర్ రోల్ లో అతడు హ్యాపీగానే ఉన్నాడని వ్యాఖ్య
అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్ కు రాడు: కారణం చెప్పిన డ్వేన్ బ్రావో
కెరియర్ మొదట్లో ఓపెనింగ్, ఫస్ట్ డౌన్ గా వచ్చిన ఎంఎస్ ధోనీ... ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ కు మారాడు. కానీ ఈ ఐపీఎల్ లో మాత్రం లోయర్ ఆర్డర్ లో వస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో జడేజా కూడా ధోనీ కంటే ముందే వస్తున్నాడు. దీనికి కారణాన్ని వెస్టిండీస్ ఆల్ రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రేవో వెల్లడించాడు.

‘‘టాపార్డర్ వరకు చూసుకుంటే ప్రతి ఒక్కరూ ధోనీ కంటే ముందే బ్యాటింగ్ కు వస్తున్నారు. జడేజా, రాయుడు, దూబే లాంటి వాళ్లకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే... ఫినిషింగ్ రోల్‌ను ధోనీ ఎంచుకున్నాడు. అందుకే లోయర్ ఆర్డర్ బాధ్యతను ధోనీ తీసుకున్నాడు. ఈ విషయంలో అతడు సంతోషంగానే ఉన్నాడు’’ అని బ్రేవో చెప్పుకొచ్చాడు. 

‘‘సీఎస్కే తీరు వేరు. దానికి ఫలితాలతో సంబంధం ఉండదు. బాగా రాణిస్తున్నామా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా కొనసాగే జట్టు మాది. మేం సీజన్‌ను సానుకూలంగా ప్రారంభించాం. మరిన్ని మ్యాచ్ లను గెలవాల్సి ఉంది’’ అని వివరించాడు. 

ఇక ఐపీఎల్ 2023 ఆసక్తికరంగా సాగుతోంది. చివరి ఓవర్ చివరి బంతి దాకా సాగుతున్న మ్యాచ్ లు ఫ్యాన్స్ కు కావాల్సినంత మజా ఇస్తున్నాయి. సగం సీజన్ పూర్తయ్యే సరికి రాజస్థాన్, గుజరాత్, చెన్నై, లక్నో జట్లు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. బెంగళూరు, పంజాబ్ జట్లు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్.. చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.


More Telugu News