కొత్త సచివాలయంలో కేసీఆర్ తొలి సమీక్ష

  • ఇరిగేషన్ శాఖపై సీఎం కేసీఆర్ రివ్యూ
  • పాలమూరు ఎత్తిపోతల పథకంపై సమీక్ష
  • సమావేశానికి హాజరుకానున్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు కొత్త సచివాలయంలో తొలి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశంలో కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణ్ పూర్ కొడంగల్ వికారాబాద్‌కు వెళ్లే తాగునీటి కాలువలను సమీక్షిస్తారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. 

తెలంగాణ నూతన సచివాలయం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవం తరువాత సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు తమకు కేటాయించిన కార్యాలయాల్లో ఆసీనులై తొలి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అంబేద్కర్ స్ఫూర్తితో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు బాధ్యతలు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.


More Telugu News