పాక్‌కు సీక్రెట్ సమాచారం లీక్ చేసిన భారతీయ శాస్త్రవేత్త అరెస్ట్
- పాకిస్థానీ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐ ఉచ్చులో డీఆర్‌డీఓ శాస్త్రవేత్త
- హనీ ట్రాప్‌లో చిక్కి సీక్రెట్ సమాచారం అందజేత
- బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసిన ముంబై ఏటీఎస్
పాకిస్థానీ ఇంటెలిజెన్స్ సంస్థ (ఐఎస్ఐ) ఏజెంట్‌కు సీక్రెట్ సమాచారం అందించిన ఓ సీనియర్ శాస్త్రవేత్తను ముంబై ఉగ్రకార్యకలాపాల నిరోధక దళం (ఏటీఎస్) తాజాగా అరెస్టు చేసింది. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్‌డీఓకు చెందిన శాస్త్రవేత్తను బుధవారం అదుపులోకి తీసుకున్నట్టు ముంబై ఏటీఎస్ అధికారులు గురువారం ప్రకటించారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ పన్నిన వలపు వలలో (హనీ ట్రాప్) చిక్కిన ఆ సైంటిస్ట్ భారత్‌కు సంబంధించిన సీక్రెట్ సమాచారాన్ని అందించినట్టు తెలిపారు. పాక్ ఏజెంట్‌తో ఆ శాస్త్రవేత్త వాట్సాప్, వీడియో కాల్స్‌తో నిత్యం టచ్‌లో ఉండేవారని పేర్కొన్నారు.
‘‘ ఓ సీనియర్ శాస్త్రవేత్తగా తన వద్ద ఉన్న అధికారిక సీక్రెట్ సమాచారం శత్రువులకు చేరితే దేశభద్రతకు ముప్పు అని తెలిసీ శత్రుదేశానికి ఈ సమాచారం చేరవేశారు’’ అని ఏటీఎస్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్‌తో పాటు ఇతర సెక్షన్ల కింద ఆ శాస్త్రవేత్తపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించింది.