ఇలా కొట్టే ఓపెనర్లుంటే టైటిల్ వీళ్లదే... గుజరాత్ భారీ స్కోరు
- అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
- మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్
- 20 ఓవర్లలో 2 వికెట్లకు 227 పరుగులు
- సుడిగాలిలా చెలరేగిన సాహా
- మెరుపుదాడి చేసిన గిల్
లక్నో సూపర్ జెయింట్స్ తో పోరులో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్ మాన్ గిల్ ఆకాశమే హద్దు అన్నట్టు వీరవిహారం చేశారు. సాహా 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేయగా... గిల్ 51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు.
వీరిద్దరూ తొలి వికెట్ కు 142 పరుగులు జోడించి సరైన ఆరంభాన్ని ఇవ్వగా... నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 2 వికెట్లకు 227 పరుగుల భారీ స్కోరు సాధించింది.
మొదట సాహా సుడిగాలి వేగంతో బ్యాటింగ్ చేశాడు. కేవలం 20 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. అర్ధసెంచరీ తర్వాత కూడా అదే స్పీడుతో వెళ్లిన సాహా చివరికి అవేష్ ఖాన్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
ఆ తర్వాత గిల్ సైతం మెరుపు ఇన్నింగ్స్ తో అలరించాడు. కేవలం సిక్సులే కొడతా అన్నట్టుగా అతడి ఇన్నింగ్స్ సాగింది. ఈ ఇన్నింగ్స్ లో గిల్ 7 సిక్సులు బాదాడు. వీరిద్దరూ అవుటైన తర్వాత కూడా లక్నో బౌలర్లకు ఊపిరి పీల్చుకునేందుకు వెసులుబాటు లభించలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 25), డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 21 నాటౌట్) కూడా మెరుపులు మెరిపించారు.
ఈ ఇన్నింగ్స్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఎనిమిది మంది బౌలింగ్ చేశారు. వారిలో వికెట్లు తీసింది ఇద్దరే. మొహిసిన్ ఖాన్ కు 1, అవేష్ ఖాన్ 1 వికెట్ దక్కాయి.