రాయలసీమ నేపథ్యంలో కథ .. 'టాక్సీవాలా' దర్శకుడితో విజయ్ దేవరకొండ!

  • విజయ్ దేవరకొండ నుంచి రానున్న 'ఖుషీ'
  • ఆ తరువాత గౌతమ్ తిన్ననూరితో కలిసి సెట్స్ పైకి 
  • రాహుల్ సాంకృత్యన్ కి మరో ఛాన్స్ 
  • 'శ్యామ్ సింగ రాయ్' సక్సెస్ తో ఉన్న డైరెక్టర్
విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఖుషీ' సినిమా రెడీ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఆయన జోడీగా సమంత కనిపించనుంది. ఈ నేపథ్యంలోనే ఆ తరువాత ప్రాజెక్టును విజయ్ దేవరకొండ లైన్లో పెట్టాడు. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడు. 

ఇక గౌతమ్ తిన్ననూరి సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతూ ఉండగానే, మరో దర్శకుడికి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఆ దర్శకుడి పేరే రాహుల్ సాంకృత్యన్. గతంలో ఆయన విజయ్ దేవరకొండకి 'టాక్సీవాలా' సినిమాతో హిట్ ఇచ్చాడు. సరైన సమయంలో విజయ్ దేవరకొండను ఆదుకున్న సినిమా ఇది. 

ఇక ఆ మధ్య నాని హీరోగా వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమాకి దర్శకుడు రాహుల్ నే. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది తెలిసిందే. అటు నాని .. ఇటు సాయిపల్లవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా అది నిలిచింది. అలాంటి రాహుల్ రాయలసీమ నేపథ్యంలోని ఒక కథను విజయ్ దేవరకొండకి వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని టాక్. 



More Telugu News