తెలంగాణలో ఇక ఆ డిగ్రీ చేస్తే బీటెక్ చేసినట్టే!
- డిగ్రీలో బీటెక్ తరహా సీఎస్ఈ కోర్సు
- నాలుగేళ్ల కాలపరిమితితో ఆనర్స్ కోర్సు
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి
తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీతోనే విద్యార్థులు బీటెక్ స్థాయి అర్హత పొందనున్నారు. రాష్ట్రంలో బీటెక్‌తో తత్సమానమైన కంప్యూటర్ సైన్స్ కోర్సును అందుబాటులోకి తేవాలని విద్యాశాఖ నిర్ణయించింది. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పేరిట నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు తెలంగాణ కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తెలిపారు. ప్రస్తుతానికి 11 ప్రభుత్వ డిగ్రీ, అటానమస్ కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ కోర్సులో ఒక్కో కాలేజీలో 60 సీట్లు అందబాటులో ఉంటాయని, ప్రైవేట్ కాలేజీలు ఆసక్తి చూపిస్తే వాటికీ అనుమతులిస్తామని తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. సాఫ్ట్ వేర్ రంగంలో ఆపారమైన అవకాశాలు లభించడంతో బీటెక్ చేసిన వారిలో అత్యధికులు ఆ రంగం వైపే చూస్తున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ కోర్సుకు డిమాండ్ పెరుగుతోంది. బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) సీట్లు పరిమితంగా ఉండటంతో డిగ్రీలోనూ బీఎస్సీ కంప్యూటర్‌సైన్స్ కోర్సును ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు.