ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య సీక్రెట్ చర్చలు!

  • కర్ణాటకలో రసవత్తరంగా రాజకీయం
  • సీఎం ఎవరనేదానిపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య రహస్య సమావేశం ఏర్పాటు
  • సిద్ధరామయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపిన హరపనహళ్లి స్వతంత్ర ఎమ్మెల్యే
కర్ణాటక రాజకీయం క్షణక్షణానికీ రసవత్తరంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో సీఎం ఎవరవుతారనేది తీవ్ర ఉత్కంఠ రేపుతున్న వేళ సిద్ధరామయ్య వేగంగా పావులు కదుపుతున్నారు. తనకే సీఎం పదవి దక్కేలా ఎమ్మెల్యేలతో రహస్య సమావేశాలకు తెరలేపారు. బెంగళూరులోని ఓ భవనంలో తనకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించనున్నారని సమాచారం. ఈ భేటీలో ఎం.బీ. పాటిల్, జమీర్ అహ్మద్‌ఖాన్, ఉత్తర కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొనే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, కొత్త సీఎంకు శుభాకాంక్షలు అంటూ సిద్ధు ఇంటి ముందు కొందరు పోస్టర్లు ఏర్పాటు చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. 

మరోవైపు, హరపనహళ్లి నుంచి గెలిచిన స్వతంత్ర ఎమ్మెల్యే లతా మల్లికార్జున, సిద్ధరామయ్యతో సమావేశమై శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. సిద్ధరామయ్యకు శుభాకాంక్షలు తెలిపినట్టు వెల్లడించారు.


More Telugu News