నాన్న బిజినెస్ మేన్ అయినప్పటికీ, ఒక్కపూటనే తింటూ కష్టాలు పడ్డాను: హీరో శివబాలాజీ
- హీరోగా సక్సెస్ కాలేకపోయిన శివబాలాజీ
- తన ఫ్యామిలీ నేపథ్యం గురించిన ప్రస్తావన
- సినిమాల పట్ల ఇష్టంతో వచ్చానని వెల్లడి
- అందుకోసం చాలా కష్టాలు పడ్డానన్న హీరో
శివ బాలాజీ హీరోగా కొన్ని సినిమాలు చేస్తూ వెళ్లాడు. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ లేకపోవడంతో వెనకబడ్డాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను టీనేజ్ లోకి వచ్చేసరికి మా ఫాదర్ పెద్ద కంపెనీ రన్ చేస్తూ ఉండేవారు. చాలామంది మా ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవారు. ఆ సంస్థకి సంబంధించిన వ్యవహారాలు నేను చూసుకోవాలని ఆయనకి ఉండేది" అని అన్నారు.
"అయితే నాకు సినిమాలంటే విపరీతమైన ఇష్టం. యాక్టింగ్ పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది. అందువలన నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేశాను. ఆ తరువాత ఫోన్ చేసి నాన్నకి విషయం చెప్పాను .. 'అయితే అక్కడే ఉండు' అంటూ ఆయన కోపంగా ఫోన్ పెట్టేశారు. నా ప్రయత్నాలు ఫలించి 'ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ'లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకి పారితోషికంగా నాకు 40 వేలు ఇచ్చారు" అని చెప్పాడు.
" ఆ సినిమా తరువాత చిన్న రూమ్ రెంట్ కి తీసుకున్నాను. మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టాను. దగ్గరున్న డబ్బులు అయిపోతున్నాయి .. అవకాశాలు రావడం లేదు. ఆ సమయంలో కావాలని చెప్పేసి నేను లేటుగా నిద్రలేచేవాడిని. ఒక పూట మాత్రమే భోజనం చేసేవాడిని. అలా నేను పడిన కష్టాలు చాలామందికి తెలియదు" అంటూ చెప్పుకొచ్చాడు.