టైటిల్ కింద నిజమైన కథ అని రాయగానే సరిపోదు: ది కేరళ స్టోరీ చిత్రంపై కమల్ హాసన్ వ్యాఖ్యలు

  • వివాదాలు రేకెత్తించిన 'ది కేరళ స్టోరీ' సినిమా
  • తనకు పబ్లిసిటీ సినిమాలు నచ్చవన్న కమల్ హాసన్
  • అలాంటి సినిమాలకు తాను వ్యతిరేకినని వెల్లడి
వివాదాస్పదంగా నిలిచిన ది కేరళ స్టోరీ సినిమాపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. తనకు పబ్లిసిటీ సినిమాలు నచ్చవని నిర్మొహమాటంగా చెప్పారు. అలాంటి సినిమాలకు తాను వ్యతిరేకినని స్పష్టం చేశారు. ఎప్పటికీ తన వైఖరి అదేనని పేర్కొన్నారు. టైటిల్ కింద నిజమైన కథ అని రాయగానే సరిపోదని, అలా రాసినంత మాత్రాన అది నిజమైన కథ అవుతుందా? అని వ్యాఖ్యానించారు. 

మే మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ది కేరళ స్టోరీ' చిత్రం సంచలన విజయం అందుకుంది. లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధానపాత్రల్లో నటించారు.


More Telugu News