గెలిచిన పతకాలను గంగానదిలో కలిపేందుకు రెజ్లర్ల యత్నం
- ప్రభుత్వం స్పందించకపోవడంతో వినూత్న నిరసనకు మహిళా రెజ్లర్ల యత్నం
- మెడల్స్ ను గంగానదిలో కలిపేందుకు హరిద్వార్ కు రెజ్లర్లు
- అడ్డుకున్న పోలీసులు, ధర్నాకు దిగిన రెజ్లర్లు
అగ్రశ్రేణి రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరన్ సింగ్ తమను లైంగికంగా వేధించాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళా రెజ్లర్లు నెల రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ రెజ్లర్లు సరికొత్త రీతిలో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తాము గెలుచుకున్న పతకాలను గంగానదిలో కలుపాలని నిర్ణయించుకున్నారు.
రెజ్లర్లు వినేష్ ఫోఘట్, సాక్షి మాలిక్, బజ్ రంగ్ పునియా తదితరులు ఈ రోజు సాయంత్రం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చేరుకున్నారు. పతకాలను గంగానదిలో పడేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రెజ్లర్లు ధర్నాకు దిగారు. రెండు రోజుల క్రితం వారు కొత్త పార్లమెంట్ భవనం ముందు ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పుడు కూడా పోలీసులు వారిని అడ్డుకొని, అరెస్ట్ చేశారు.