రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలు

  • జిల్లాకేంద్రాల వేడుకల్లో పాల్గొన్న మంత్రులు
  • సిరిసిల్లలో జాతీయ పతాకం ఎగరవేసిన మంత్రి కేటీఆర్
  • సిద్దిపేటలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు
  • ఉత్సాహంగా పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు
తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గ్రామగ్రామానా జరుగుతున్న ఈ వేడుకల్లో జనం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కలెక్టరేట్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరులను గుర్తుచేసుకున్నారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి వద్ద చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సిరిసిల్ల కలెక్టరేట్ లో మంత్రి కేటీఆర్, సిద్దిపేట కలెక్టరేట్ లో మంత్రి హరీశ్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

గ్రామ స్థాయిలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు స్థానికులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ ప్రత్యేక ఉద్యమం నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణలో వచ్చిన మార్పులు, ఇక ముందు రావాల్సిన మార్పులపై నేతలు మాట్లాడారు. కరీంనగర్ లో జరిగిన వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్, ఖమ్మంలో పువ్వాడ అజయ్, నిజామాబాద్ లో ప్రశాంత్ రెడ్డి, జనగామలో ఎర్రబెల్లి దయాకర్ రావు, వనపర్తిలో నిరంజన్ రెడ్డి, సంగారెడ్డిలో మహమూద్ అలి, నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డి, మహబూబాబాద్ లో సత్యవతి రాథోడ్, మేడ్చల్ లో మల్లారెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్, సరూర్ నగర్ లో సబితా ఇంద్రారెడ్డి, మెదక్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.


More Telugu News