3నే అవినాశ్‌రెడ్డి అరెస్ట్.. ఆపై విడుదల!
- వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా అవినాశ్‌రెడ్డి
- విచారణకు వచ్చినప్పుడు సాంకేతికంగా అరెస్ట్
- రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకుని విడుదల
- గోప్యంగా ఉంచిన సీబీఐ, అవినాశ్‌రెడ్డి వర్గాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ అవినాశ్‌రెడ్డిని విచారణకు పిలిచిన సీబీఐ అరెస్ట్ చేసిందా? ఆ వెంటనే బెయిలుపై విడుదల చేసిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఈ నెల 3న విచారణ కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు అవినాశ్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకుని వెంటనే ఆయనను విడిచిపెట్టింది.
తెలంగాణ హైకోర్టు గత నెల 31న అవినాశ్‌రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఆయనను అరెస్ట్ చేయాల్సి వస్తే పూచీకత్తులు తీసుకుని వెంటనే విడుదల చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత శనివారం ఆయన విచారణ కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు సాంకేతికంగా అరెస్ట్ చేసి పూచీకత్తులు తీసుకుని విడుదల చేసింది. ఈ విషయం బయటపడకుండా సీబీఐ, అవినాశ్‌రెడ్డి వర్గాలు జాగ్రత్త పడ్డాయి.