చీప్‌గా అవుటైన వెంటనే ఫుడ్ లాగించేసిన కోహ్లీ.. ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్న అభిమానులు
- 14 పరుగులు మాత్రమే చేసి అవుటైన కోహ్లీ
- 2003 ప్రపంచకప్ ఫైనల్‌లో త్వరగా అవుటైన సచిన్ మూడు రోజుల వరకు భోజనం ముట్టలేదన్న అభిమానులు
- కోహ్లీ మాత్రం క్షణం కూడా తినకుండా ఉండలేకపోయాడని ఫైర్
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. కష్ట సమయంలో ఉన్న జట్టును ఆదుకోవాల్సిన సమయంలో కోహ్లీ 14 పరుగులు మాత్రమే చేసి స్టార్క్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ వెంటనే డ్రెస్సింగ్ రూముకు చేరుకున్న కోహ్లీ ఆలస్యం చేయకుండా ఫుడ్ లాగించేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు ట్రోల్స్‌తో విరుచుకుపడ్డారు.
‘తినండి, తాగండి, స్నేహితులతో ఎంజాయ్ చేయండి. అభిమానుల గురించి మాత్రం చింతించకండి’ అని ఓ యూజర్ ఫైర్ అయితే, ‘ఐపీఎల్ అసలైన ఐసీసీ ట్రోఫీ అని యువ ఆటగాళ్లకు కోహ్లీ చెబుతున్నాడు’ అని మరో యూజర్ ఆ ఫొటోకు కామెంట్ చేశాడు. 2003 ప్రపంచకప్ ఫైనల్‌లో త్వరగా అవుటైన సచిన్ మూడు రోజుల వరకు భోజనం ముట్టలేదని, కానీ కోహ్లీ మాత్రం డ్రెస్సింగు రూముకు వచ్చిందే ఆలస్యమన్నట్టు లాంగిచేస్తున్నాడని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.