తెలంగాణ ఐఏఎస్ అధికారిపై భార్య సంచలన ఫిర్యాదు.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న కోర్టు

  • ఐఏఎస్ అధికారి అయిన భర్తపై ఆయన భార్య సంచలన ఆరోపణలు
  • అదనపు కట్నం కోసం హింసిస్తున్నారని ఫిర్యాదు
  • తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న సందీప్‌కుమార్ ఝా
ఐఏఎస్ అధికారి అయిన భర్తపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. కట్నం కోసం వేధిస్తున్నారంటూ  కోర్టుకెక్కారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా స్వస్థలం బీహార్‌లోని దర్భంగా జిల్లా. 2021లో కోర్బా ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నారు.

ఆ సమయంలో కట్నకానుకల కోసం అమ్మాయి తల్లిదండ్రులు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఇటీవల, ఆమె భర్తపై పలు ఆరోపణలు చేశారు.  గృహ హింసతోపాటు, వివాహం తర్వాతి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవారని  కోర్బా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆమె ఆరోపించారు. 

పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో చత్తీస్‌గఢ్‌లోని కోర్బా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సందీప్ కుమార్ ఝాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సందీప్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.


More Telugu News