ఫాదర్స్ డే సందర్భంగా సుధీర్ బాబు కొత్త సినిమా పోస్టర్ రిలీజ్.. టైటిల్ ఇదే!

  • సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ‘మా నాన్న సూపర్‌ హీరో’
  • తెరకెక్కిస్తున్న ‘లూజర్’ వెబ్ సిరీస్ దర్శకుడు అభిలాష్‌ రెడ్డి కంకర
  • వానాకాలంలోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటన
ఫాదర్స్ డే సందర్భంగా సుధీర్ బాబు కొత్త సినిమా పోస్టర్ రిలీజ్.. టైటిల్ ఇదే!
జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తున్నారు సుధీర్ బాబు. తన కెరియర్ లో ఎన్నో వినూత్న కథాంశాలను ఎంపిక చేసుకుంటున్నా.. సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నారు. కమర్షియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. మధ్యలో ‘సమ్మోహనం’ డీసెంట్ హిట్ ఇచ్చినా.. తర్వాత మళ్లీ వరుస పరాజయాలే పలకరించాయి. ఈ ఏడాది రిలీజైన హంట్‌, మామ మశ్చీంద్ర ఫ్లాప్ ను మూటగట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో సుధీర్ బాబు నటిస్తున్న మరో సినిమాకు సంబంధించిన అప్ డేట్ తాజాగా వచ్చింది. సినిమా టైటిల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. చిత్రానికి ‘మా నాన్న సూపర్‌ హీరో’ అనే పేరు ఖరారు చేశారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ వానాకాలంలోనే సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

పోస్టర్‌లో కేరళ స్టేట్ లాటరీ అంటూ కోటి రూపాయలను ఒకరు గెలుచుకున్నట్లు ఓ ఫ్లెక్సీ పెట్టారు. ఇది సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. ‘లూజర్’ వెబ్ సిరీస్ ను తెరెకెక్కించిన అభిలాష్‌ రెడ్డి కంకర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. కామ్ ఎంటర్‌టైన్ మెంట్స్‌ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.


More Telugu News