రామ్ చరణ్-ఉపాసన దంపతుల బిడ్డ కోసం కీరవాణి తనయుడి స్పెషల్ ట్యూన్

  • జూన్ 20న బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉపాసన
  • రామ్ చరణ్, ఉపాసనలపై ముందస్తు శుభాకాంక్షల వెల్లువ
  • ఓ ట్యూన్ క్రియేట్ చేసి రామ్ చరణ్, ఉపాసనలకు పంపిన కాలభైరవ
రామ్ చరణ్-ఉపాసన దంపతుల బిడ్డ కోసం కీరవాణి తనయుడి స్పెషల్ ట్యూన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ తొలి బిడ్డకు రేపు స్వాగతం పలకనున్నారు. జూన్ 20న ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్-ఉపాసనల బిడ్డ కోసం కీరవాణి తనయుడు కాలభైరవ ప్రత్యేక బాణీ రూపొందించడం విశేషం. ఈ స్పెషల్ ట్యూన్ ను కాలభైరవ... రామ్ చరణ్, ఉపాసనలకు కానుకగా పంపించారు. 

ఊహించని గిఫ్ట్ తో చరణ్, ఉపాసన ముగ్ధులయ్యారు. బిడ్డకు స్వాగతం పలకబోతున్న ఆనందంలో ఉన్న తమకు ఈ మ్యూజికల్ గిఫ్ట్ మరింత ఆనందం కలిగించిందంటూ కాలభైరవకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు ఈ ట్యూన్ సంతోషం కలిగిస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.


More Telugu News