నాపై దాడికి రాళ్లు పట్టుకొని తిరిగారు.. నా కోసం సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయ్: పవన్ కల్యాణ్
- నిన్న రాజోలులో దాడికి యత్నించారని ఆరోపణ
- ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్న జనసేనాని
- ప్రజల్లో మార్పు వస్తోందని అధికారంలో ఉన్నవాళ్లు ఉలిక్కిపడుతున్నారని వ్యాఖ్య
నిన్న రాజోలులో తనపై కొంతమంది దాడికి ప్రయత్నించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కోనసీమలో వారాహి యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై దాడి చేసేందుకు రాళ్లు పట్టుకొని నలుగురు తిరిగారన్నారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని చెప్పారు. తన ద్వారా ప్రజల్లో మార్పు వస్తోందని అధికారంలో ఉన్నవాళ్లు ఉలిక్కిపడుతున్నారని దుయ్యబట్టారు. తన కోసం సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయన్నారు. ఎన్నికలు రాగానే రాష్ట్రానికి టూరిస్టులు క్యూ కడతారని ఎద్దేవా చేశారు.
అంతకుముందు పి గన్నవరం నియోజకవర్గ పార్టీ నాయకుల సమావేశంలో పవన్ మాట్లాడారు. వైసీపీ పాలన నుండి ఉభయ గోదావరి జిల్లాలను విముక్తం చేయాలన్నారు. రాజోలలో నాయకుడు వెళ్లిపోయినా పార్టీ శ్రేణులు అండగా నిలబడ్డాయని పార్టీ నుండి గెలిచి వైసీపీ వైపు వెళ్లిన ఎమ్మెల్యేను ఉద్దేశించి అన్నారు. ఇక్కడి వారు ఇచ్చిన ప్రేరణతోనే వారాహి యాత్రను ప్రారంభించినట్లు చెప్పారు.