పట్టపగలు నడివీధిలో దారుణం.. స్నేహితుడి గొంతు కోసి రక్తం తాగిన వ్యక్తి

  • కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో వెలుగులోకొచ్చిన షాకింగ్ ఘటన
  • భార్యతో తన స్నేహితుడికి అక్రమసంబంధం ఉందని అనుమానపడ్డ నిందితుడు
  • ఈ విషయమై చర్చిద్దామంటూ స్నేహితుడిని పిలిచి దాడి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్, నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
  • బాధితుడికి ఆసుపత్రిలో చికిత్స
కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పట్టపగలు నడివీధిలో తన స్నేహితుడి గొంతు కోసి రక్తం తాగాడు. చిక్కబళ్లాపూర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విజయ్‌ అనే వ్యక్తి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తన స్నేహితుడు మారేశ్ ఆమెతో సన్నిహితంగా ఉన్నాడని అనుమానిస్తున్నాడు. ఈ విషయమై చర్చించేందుకు రావాలంటూ మారేశ్‌ను పిలిచాడు. 

ఇద్దరూ మాట్లాడుకుంటుండగా వారి వాగ్వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో కోపంతో రెచ్చిపోయిన విజయ్ పదునైన ఆయుధంతో మారేశ్ గొంతు కోసేశాడు. ఆ తరువాత కిందపడి ఉన్న మారేశ్‌ను ఏదో ప్రశ్నిస్తూ, అతడ మెడ నుంచి పెల్లుబికి వస్తున్న రక్తాన్ని కిందకు వంగి తాగే ప్రయత్నం చేశాడు. ఈ షాకింగ్ దృశ్యాల్ని దారినపోయే వారు కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఉదంతం వైరల్‌గా మారింది. ఆ తరువాత పోలీసులు విజయ్‌ను అరెస్టు చేసి అతడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేవశారు. ప్రస్తుతం మారేశ్ స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


More Telugu News