సెలేనా గోమెజ్ తో నా పెళ్లి జరిపించండి.. : సోనూ సూద్ ను కోరిన అభిమాని
- మేరీ షాదీ కర్వాదో సర్ అంటూ ట్విట్టర్ లో విజ్ఞప్తి
- నటనను ఆపేసి మ్యారేజ్ బ్యూరో పెట్టమంటావా ఏంటి? అంటూ ప్రశ్న
- ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్న సోనూ
అభిమానులు అడిగే ప్రశ్నలు ఒక్కోసారి సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో నవ్వులు కూడా తెప్పిస్తుంటాయి. ప్రముఖ నటుడు సోనూసూద్ ను ఓ అభిమాని సాధ్యం కాని పని చేసి పెట్టాలని కోరాడు. ఆరవ్ కే చౌదరి అనే యూజర్ ట్విట్టర్ లో సోనూసూద్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ‘‘సెలేనా గోమెజ్ సే మేరీ షాది కర్వా దో సర్’’అని ట్వీట్ చేశాడు. అంటే హాలీవుడ్ నటి, గాయని సెలెనాతో తనకు వివాహం జరిపించాలని కోరాడు.
దీనికి సోనూసూద్ ఏ మాత్రం తగ్గకుండా రిప్లయ్ ఇచ్చారు. ‘‘చూడు అబ్బాయ్.. నీవు ఇప్పుడు నన్ను నటనను ఆపివేయించి ఓ మ్యారేజ్ బ్యూరోని తెరిపించేలా ఉన్నావు’’ అంటూ చమత్కారంగా బదులు ఇచ్చారు. ఈ సంభాషణను చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. మరోవైపు సోనూసూద్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. స్ట్రాబెర్రీస్ విక్రయిస్తున్న 18 ఏళ్ల ఓ బాలుడిని చూసి అతడితో మాట్లాడారు. మాట్లాడడమే కాదు, అతడి వద్ద మిగిలి ఉన్న అన్ని స్ట్రాబెర్రీ బాక్సులను కొనుగోలు చేసి తన వంతు సాయం అందించారు.