నెల్లూరు రూరల్ లో లోకేశ్ కు అపూర్వ స్వాగతం పలికిన కోటంరెడ్డి బ్రదర్స్... ఫొటోలు ఇవిగో!
- నెల్లూరు జిల్లాలో యువగళం
- సర్వేపల్లి నియోజకవర్గంలో ముగిసిన లోకేశ్ పాదయాత్ర
- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రవేశించిన వైనం
- వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
- నెల్లూరు రూరల్ లో ఎటు చూసినా యువగళం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. లోకేశ్ రాకతో నెల్లూరు రూరల్ జనసంద్రంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తమ శ్రేణులతో కలిసి లోకేశ్ కు అపూర్వ స్వాగతం పలికారు.
భారీ స్థాయిలో కళాకారులు తమ కళారూపాలు ప్రదర్శిస్తుండగా, లోకేశ్ ను తమ నియోజకవర్గంలోకి స్వాగతించారు. పాట కచేరీలు, తప్పెట్లు, కేరళ వాయిద్యాలతో హోరెత్తించారు. లోకేశ్ ను ప్రత్యేకంగా తయారుచేసిన బేబీ కార్న్ కండెలతో చేసిన భారీ హారంతో గౌరవించారు. బూడిద గుమ్మడికాయలతో మరో హారం రూపొందించి లోకేశ్ కు నరదృష్టి సోకకుండా నివారణ చేశారు.
లోకేశ్ రాక నేపథ్యంలో, నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఎటు చూసినా జనం, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కనిపించాయి. లోకేశ్ ను చూడటానికి వచ్చిన జనంతో నెల్లూరు రూరల్ రోడ్లు క్రిక్కిరిసిపోయాయి.
వేలాదిగా రోడ్ల పైకి వచ్చిన ప్రజలు, పాదయాత్రలో పాల్గొన్న వేల మంది యువతతో లోకేశ్ యువగళం జాతరను తలపించింది. తనని చూడటానికి వచ్చిన మహిళలు, యువత, వృద్ధులను నారా లోకేశ్ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈ పాదయాత్రలో ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.